Poonam Kaur:కడప వాళ్లు బెదిరించారు-ఆయన వల్లే నాపెళ్లి ఆగిపోయింది..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో 'పంజాబీ గుమ్మ'గా అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్, గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.గత కొన్నేళ్లుగా పూనమ్ కౌర్‌ను రాజకీయ చర్చల్లో కూడా లాగుతున్నారు. కొందరు సెలబ్రిటీలపై ఎక్స్ వేదికగా ఆమె వేస్తున్న సెటైరికల్ పోస్టులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల నుంచి తనకు బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చాయని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కడప నుంచి కొందరు నన్ను బెదిరించారు
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ కడపకు చెందిన కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి ఆ నటుడిని తిట్టాలని చెప్పినట్లు పూనమ్ గుర్తు చేశారు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెకు కావాల్సినంత డబ్బు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చినట్లు పూనమ్ చెప్పారు. ఒక రాజకీయ పార్టీలో మంచి పొజిషన్ కూడా కల్పిస్తామని చెప్పినట్లు పూనమ్ తెలిపింది.ఇక ఇచ్చిన రెండు ఆఫర్లను తిరస్కరించడంతో ఆమె న్యూడ్ వీడియోలను రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది.అయితే జరిగిన ఈ విషయం ఎవరితో చెప్పుకోలేదని తనలోనే దిగమింగుకుని మనోవేదనకు గురైనట్లు వెల్లడించారు.

రాజకీయ చదరంగంలో బలైపోయానా?
గతంలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే క్రమంలో పోసాని కృష్ణమురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు పూనమ్ కౌర్‌ను తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో పోసాని చేసిన 'పంజాబీ అమ్మాయి' వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవేనని, అప్పటి నుంచి తన జీవితం నరకప్రాయమైందని పూనమ్ పేర్కొన్నారు.
"ఆ సమయంలో నేను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. సంబంధాలు కూడా చూస్తున్నాం. కానీ, పోసాని పెట్టిన ప్రెస్ మీట్, ఆ తర్వాత జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్ నా పెళ్లి కలను చిధ్రం చేశాయి. సంబంధం కుదురుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో నా వ్యక్తిగత జీవితం దెబ్బతింది" అని పూనమ్ భావోద్వేగానికి లోనయ్యారు.వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా తాను ఎంతో కోల్పోయానని, ఒక దశలో సమాజానికి ముఖం చూపించలేక మౌనంగా అన్నింటినీ భరించాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.
పూనమ్ వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలపై మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్ స్టేట్మెంట్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు ఎలా దెబ్బతింటాయో ఈ సంఘటన మరోసారి చర్చకు తెచ్చింది.పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యవహారంపై పోసాని కృష్ణ మురళి నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.












Click it and Unblock the Notifications