సమంతపై పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సమంత చేసిన ఓ పని పెద్ద వివాదంగా మారింది. మయసైటీస్ వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. తాజాగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ వాడకంపై గురించి సమంత ఇచ్చిన సలహా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ వాడకం గురించి సమంత తప్పుగా చెబుతున్నారని..ఆమెను జైల్లో పెట్టాలని ఓ డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది.తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు.. తన డాక్టర్‌తో చర్చకు వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని సమంత అభిప్రాయపడింది. కానీ ఇలా మెసేజ్ చేయడంతో చీప్ అయిపోయాడని ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది.ఈ ఘటనపై ఆ డాక్టర్ సమంతకు క్షమాపణలు సైతం చెప్పడం జరిగింది. అయినప్పటికి దీనిపై కొందరు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్, తమిళ హీరో విష్ణు విశాల్ భార్య గుత్తాజ్వాల స్పందించారు.

సమంత తీరుపై గుత్తాజ్వాల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుత్తాజ్వాల స్పందిస్తూ..'జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటి వారికి సహాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా?' అంటూ ట్విట్టర్ వేదికగా సమంతపై గుత్తాజ్వాల విమర్శలు చేసింది.
తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ సైతం సమంత ఇచ్చిన హెల్త్ టిప్ గురించి స్పందించారు. దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ చాలామంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు కానీ వాళ్లు మాత్రం చక్కెర ఉన్నటువంటి పదార్థాలు అనగా చాక్లెట్లు ఇతర పానీయాలను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇదంతా కేవలం డార్క్ రియాలిటీ అంటూ సమంత ఆరోగ్య చిట్కాలపై పూనమ్ ఈ కామెంట్స్ చేసింది.












Click it and Unblock the Notifications