త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోండి..పూనమ్ కౌర్ సంచనలం

హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు వ్యతిరేకంగా పూనమ్ కౌర్లు ట్వీట్లు చేయడం జరిగింది. తాజాగా మరోసారి దర్శకుడు త్రివిక్రమ్‌పై సంచలనం కామెంట్స్ చేశారు.ఆ వివరాల్లోకి వెళ్తే..హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas

అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల ఎప్పుడూపై పరోక్షంగా ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. తాజాగా మరోసారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సినీ ఇండస్ట్రీ.. మహిళా ఆరిస్టులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తెలియజేయడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై పూనమ్ కౌర్ రియాక్ట్ అవుతూ..త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas

అంతే కాకుండా..గతంలో గురూజీ అంటూ త్రివిక్రమ్‌ పరోక్షంగా సంబోధించే పూనమ్ కౌర్.. ఈసారి ఏకంగా ఆయన పేరును నేరుగా ప్రస్తావించి షాకిచ్చింది.త్రివిక్రమ్ మీద తాను చేసిన కంప్లైంట్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన చెందారు. అంతకుముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంపైనా పూనమ్ కౌర్ స్పందించారు. మరోసారి జానీని మాస్టర్ అని పిలవొద్దని అభిమానులకు, ఇండస్ట్రీ పెద్దలను కోరారు. అలా పిలిపించుకోవాలంటే గౌరవం ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి పూనమ్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+