ప్రముఖ సీరియల్ నటి "నందిని" అకాల మృతికి కారణం అదేనా !!
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ నటి నందిని అకాల మరణం తమిళ, కన్నడ టెలివిజన్ రంగాల్లో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. బెంగళూరులోని తన నివాసంలో ఆమె మృతిచెందగా.. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నందిని మృతి పట్ల సహ నటీనటులు, టీవీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని.. తన మాతృభాష కాకపోయినా తమిళం, కన్నడ భాషల్లో సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. టెలివిజన్ రంగంలో కష్టపడి ఎదిగిన ఆమె, భాషా పరిమితులను దాటి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె మరణానికి ముందు సూసైడ్ నోట్ రాయగా ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ముఖ్యంగా తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఇటీవలే ఈ సీరియల్ షూటింగ్ బెంగళూరు నుంచి చెన్నైకి మారింది. దీంతో షూటింగ్ షెడ్యూల్‌లో కొద్దిరోజుల విరామం తీసుకున్న ఆమె.. ఇలా అనూహ్యంగా మృతి చెందడం సర్వత్రా దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఇక 'గౌరి' సీరియల్‌ను ప్రసారం చేస్తున్న కలైంజర్ టీవీ ఛానల్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. మృతిని గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అధికారిక నిర్ధారణ వచ్చేవరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దని సూచించారు.
🕊️ Rest in Peace, Actress Nandini🙏😢
— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025
Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x
మరోవైపు పేరెంట్స్ ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నందిని కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరిస్తున్నారు. మరి ఆమె మరణానికి గల కారణాలు త్వరలోనే బయటపడనున్నాయి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications