ఒక్క సినిమా హిట్.. ఏకంగా మరో 36 చిత్రాల్లో ఛాన్స్ !!
తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. తన ముక్కుసూటితనం, విభిన్నమైన డైలాగ్ డెలివరీ, బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మొదట ప్రముఖ రచయిత పూసల రాధాకృష్ణమూర్తి వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన.. తర్వాత పరుచూరి బ్రదర్స్ వద్ద అసోసియేట్‌గా చేరారు. కానీ రచయితగా పోసానికి అసలైన బ్రేక్ ఇచ్చిన చిత్రం 'పవిత్ర బంధం'. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పోసాని పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. ఆ తర్వాత 'పెళ్లిచేసుకుందాం', 'గోకులంలో సీత', 'గాయం', 'రక్షకుడు', 'గణేష్' వంటి వరుస హిట్ సినిమాలకు కథలు, డైలాగులు అందించారు.
ఇక 'శ్రావణమాసం' సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన.. తర్వాత తెరకెక్కించిన 'ఆపరేషన్ దుర్యోధన' భారీ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 'మెంటల్ కృష్ణ', 'పోసాని జెంటిల్మన్' వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఇక పోసాని కెరీర్‌లో అతిపెద్ద మలుపు మాత్రం నటుడిగానే వచ్చింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన.. 'బాబీ' సినిమాలో కనిపించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. 'నాయక్', 'టెంపర్', 'రేసుగుర్రం', 'అత్తారింటికి దారేది', 'ధృవ' వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని.. 'నాయక్' సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

పోసాని మాట్లాడుతూ.. "నా సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రాల్లో "నాయక్" మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ మూవీ డైరెక్టర్ వీవీ వినాయక్ ఫోన్ చేసి సినిమాలో మీకోసం ఒక క్యారెక్టర్ ఉందని.. మూడు రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయగలరా అని అడిగారన్నారు. కాగా షూటింగ్ మొదటి రోజే నేను చెప్పిన డైలాగ్స్‌కు.. నా యాక్టింగ్‌కు ఉన్నవారంతా పగలబడి నవ్వారు. ఆ తర్వాత పాత్ర నిడివిని మరింత పెంచుతున్నామని చెప్పారు. అలా కేవలం మూడు రోజుల కోసం అనుకున్న క్యారెక్టర్.. ఏకంగా 18 రోజుల పాటు షూటింగ్ జరిగిందని తెలిపారు.
అలానే సినిమా ఫైనల్ కాపీ చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా తన కామెడీ సీన్స్ చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆ పాత్రకు మంచి పేరు వచ్చిందని.. కేవలం వారం రోజుల్లోనే తనకు ఏకంగా 36 కొత్త సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.













Click it and Unblock the Notifications