మహేష్ బాబుకు ఎవరూ చేయలేని సాయం చేసిన పవన్ కల్యాణ్

చిరంజీవి తమ్ముడి గా పరిశ్రమలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకోవడమేకాదు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. పవర్ స్టార్ అనే బిరుదును కూడా దక్కించుకున్నారు. ఆయన చేసిన తొలిప్రేమ, ఖుషి లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అంతేకాదు.. భారీ ఇమేజ్ ను పవన్ కల్యాణ్ కు కట్టబెట్టాయి.

పవన్ కళ్యాణ్ స్టార్ హీరో గా మారిన తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే సమయంలో మార్కెట్ లో ఒక్కడు సినిమాకు సంబంధించి పైరసీ వీడియోలు దొరికాయి. దీనికి వ్యతిరేకంగా మహేష్ బాబు చేసిన పోరాటానికి పవన్ ఎంతో మద్దతుగా నిలిచారు. చాలావరకు చేయవల్సిన సహాయం అంతా చేశారు. వీరిద్దరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంవల్లే కొంతవరకు తగ్గింది. అలా పవన్ చేసిన సాయంవల్ల ఒక్కడు సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మహేష్ బాబుకు స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది.

power star pawan kalyan helps super star maheshbabu

ఆ తర్వాత మహేష్ బాబు - పవన్ కల్యాణ్ మధ్య మంచి స్నేహం కుదిరింది. ఈరోజు వరకు ఆ స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. జల్సా సినిమాకు పవన్ అడగడంతోనే మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ముందు వీరిద్దరూ సత్యానంద దగ్గరే నటనలో శిక్షణ తీసుకున్నారు. ముందుగా పవన్ కల్యాణ్ శిక్షణ తీసుకోగా, తర్వాత మహేష్ బాబు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పరిశ్రమలో స్టార్ హీరోలుగా రాణిస్తూ అభిమానులు, సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+