పదమూడో 'సారీ' పవన్ కు తప్పని పరీక్ష..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు అన్ని గండాలు దాటి ఎట్టకేలకు జులై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఏకంగా 12 సార్లు ఈ మూవీ వాయిదా పడినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజై రికార్డు వ్యూస్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా జులై 24 న విడుదలకు ముస్తాబవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరో అడ్డంకి ఏర్పడినట్లు తెలుస్తోంది.
05-07-2025న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన బహుజన సంఘాల సమావేశంలో బిసి నాయకుడు డాక్టర్ వై. శివ ముదిరాజ్ మాట్లాడుతూ, “హరిహర వీరమల్లు” @HHVMFilm @HHVMBookings సినిమా చరిత్రను వక్రీకరిస్తూ, పండుగ సాయన్న గారి వీరగాథను తారుమారు చేస్తూ, కల్పిత కథలు ప్రచారం చేస్తోంది. ఇది… pic.twitter.com/GLFRcY0as2
— Mudiraj Political Voice ముదిరాజ్ పొలిటికల్ వాయిస్ (@yamma7029) July 6, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. అయితే తాజాగా ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటూ ముదిరాజ్ లు నిరసనకు దిగారు. ఈ సినిమా విడుదలను సైతం అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అనుకున్న టైమ్ కు రిలీజ్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఈ సారి వాయిదా పడితే 13 సార్లు ఈ మూవీ వాయిదా పడ్డట్లు అని లెక్కలేసుకుంటున్నారు నెటిజెన్లు.

ఇక తాజాగా హరిహర వీర మల్లు సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే తెలుగు వెర్షన్ లో 48 మిలియన్ వ్యూస్ దక్కించుకుని తొలి స్థానంలో నిలిచింది. ఇక అన్ని భాషల్లో కలిపితే ఈ మూవీ ట్రైలర్ కు 61.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ జూలై 19న తిరుపతిలో జరగనున్నట్లు టాక్.
టాలీవుడ్ దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించారు.












Click it and Unblock the Notifications