శుభవార్త చెప్పబోతున్న ప్రభాస్ - అనుష్క?

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో రాజాసాబ్ సినిమా మారుతి దర్శకత్వంలో చేస్తున్నారు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూ.500 కోట్ల బడ్జెట్ తో ఫౌజీ చేస్తున్నారు. ఈ రెండు కాకుండా కొత్త సంవత్సరంలో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ప్రారంభం కాబోతోంది. దాదాపు రూ.వెయ్యి కోట్లపైనే బడ్జెట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు సందీప్ చాలామందిని పరిశీలిస్తున్నారు. ఇటీవలి వరకు త్రిష పేరు ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వార్త వైరలవుతోంది.

అభిమానులు మాత్రం బలంగా కోరుకుంటున్నారు
వైరలవుతున్న వార్త ప్రకారం స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా అనుష్క పేరును సందీప్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి జంట బాగుంటుందని, వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుందనే విషయం అందరికీ తెలుసు. దీంతో అనుష్క, ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లైంది. వాస్తవానికి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చేవి. అటువంటిదేమీ లేదని, కేవలం తాము స్నేహితులమేనని ఇద్దరూ స్పష్టత ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు.

Prabhas and Anushka to announce good news soon

మల్టీప్లెక్స్ లను బతికిస్తున్నాడు
ఇటీవలే ఏఐతో వీరిద్దరి పెళ్లి ఫొటోలను క్రియేట్ చేయడంతోపాటు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు సృష్టించారు. ఓ మంచి ముహూర్తం చూసి స్పిరిట్ ప్రారంభించాలనే యోచనలో సందీప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరియాకు చెందిన నటుణ్ని విలన్ గా తీసుకోబోతున్నారు. అతన్ని తీసుకుంటే ప్రభాస్ కు బలమైన ప్రత్యర్థి దొరికినట్లవుతుందని, సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. స్పిరిట్ తర్వాత సలార్ 2, కల్కి2 చేయాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా తన నుంచి కచ్చితంగా విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ వేసుకుంటున్నారు. దీనివల్ల మల్టీప్లెక్స్ లన్నీ కళకళలాడుతున్నాయని ఇటీవలే మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ కొనియాడింది. మల్టీప్లెక్స్ లను బతికించే కథానాయకుడని ప్రభాస్ గురించి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+