ప్రభాస్ - రామ్‌చరణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
తెలుగు సినిమాకు ప్రస్తుతం నడుస్తున్న కాలం స్వర్ణయుగం అని చెప్పొచ్చు. జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాలు మంచి ఖ్యాతిని తెచ్చుకుంటున్నాయి. బాహుబలి నుంచి మొదలైన ఈ ప్రస్థానం అవిశ్రాంతంగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు దక్కింది. పుష్ప2 సినిమా త్వరలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన నెంబర్ వన్ సినిమాగా నిలవబోతోంది. తెలుగు నుంచి వచ్చే సినిమాలు దాదాపు రూ.వెయ్యి నుంచి రూ.1200 కోట్లు దక్కించుకుంటున్నాయి.
పట్టాలెక్కని మల్టీస్టారర్
ప్రభాస్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. అందుకు కారణం.. రాజమౌళి. రామ్ చరణ్ తో మగధీర సినిమా తీసిన తర్వాత ప్రభాస్, రామ్ చరణ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి రాజమౌళి ప్రణాళికలు రూపొందించారు. అయితే అనివార్య కారణాలవల్ల అది పట్టాలెక్కలేదు. ఇప్పటికీ దీనికి సంబంధించిన కారణాలు మాత్రం బయటపడలేదు. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ను పెట్టి భారీ హిట్ కొట్టాడు రాజమౌళి. ఈ సినిమా దాదాపు రూ.1350 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది.

అద్భుతాలను క్రియేట్ చేయబోతున్నాడు
అయితే ప్రభాస్ తో మరో హీరోను పెట్టి సినిమా తీస్తాడేమోనని డార్లింగ్ అభిమానులు ఆశగా ఎదురుచూశారుకానీ రాజమౌళి చేయలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో అంతర్జాతీయస్థాయి క్వాలిటీతో, హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాతో ఎన్ని అద్భుతాలను క్రియేట్ చేయనున్నాడో అనే ఉత్కంఠ ప్రిన్స్ అభిమానుల్లో నెలకొంది. రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ సినిమా వచ్చేనెల 10వ తేదీన విడుదల కాబోతోంది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దీన్ని రూపొందించడంతోపాటు దిల్ రాజు నిర్మాత కావడంతో దీనిపై అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. విడుదలైన తర్వాతకానీ ఈ సినిమా ఎటువంటి విజయాన్ని దక్కించుకుంటుందనే విషయంలో స్పష్టత రాదు.












Click it and Unblock the Notifications