రవితేజ వద్దంటే... ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు

ఎప్పుడు ఏ సినిమా ఎవరిని అందలం ఎక్కిస్తుందో అర్థం కాదు.. అలాగే ఏ సమయంలో ప్రేక్షకులు ఏ సబ్జెక్టును ఆదరిస్తారో అంతకన్నా అర్థం కాదు. కాలం కలిసొస్తే సాధారణ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. కాలం కలిసి రాకపోతే బ్లాక్ బస్టర్ కథతో తెరకెక్కినా సినిమా మాత్రం హిట్టవదు. సమయాన్ని బట్టి, ప్రేక్షకుల ఇష్టాన్ని బట్టి సినిమావారి అదృష్టం ఆధారపడివుంటుంది. ఈకోవలోనే రవితేజ్ మిస్ చేసుకున్న చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

దర్శకుడిగా మారిన కొరటాల
ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందింది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు. ప్రభాస్-అనుష్క జంటకు ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమా ఎంతో స్టైలిష్ గా రూపొంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది. ఈ సినిమాతోనే అప్పటివరకు కథా రచయితగా ఉన్న కొరటాల శివ దర్శకుడిగా మారారు. తన మొదటి చిత్రంలోనే సూపర్ హిట్ కొట్టారు.

prabhas and raviteja latest news

వద్దన్న రవితేజ
రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమాకి కొరటాల శివ మాటలు అందించాడు. అది కూడా సూపర్ హిట్ అయింది. అప్పుడు రవితేజతో ఉన్న పరిచయం వల్ల శివ ఈ కథను అతనిదగ్గరకు తీసుకువెళ్లాడు. అయితే రవితేజ ఈ సినిమాను చేయననడంతో ఇదే కథతో ప్రభాస్ దగ్గరకు వెళ్లగా డార్లింగ్ కు స్టోరీ బాగా నచ్చింది. అయితే చిన్న సమస్య వల్ల ఏం చేయాలో అర్థం కావడంలేదని కొరటాలతో వ్యాఖ్యానించాడు.

ప్రభాస్ కు బూస్ట్
ప్రభాస్ అప్పటికే రాజమౌళి సినిమా బాహుబలికి అగ్రిమెంట్ చేశాడు. మిర్చి చేయాలి అంటే రాజమౌళితో మాట్లాడాలని కొరటాల శివకు ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడు. రాజమౌళితో మాట్లాడగా తను కూడా ఒప్పుకోవడంతో ఆరు నెలల్లో దాన్ని కొరటాల పూర్తిచేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాహుబలికి ముందు ఈ సినిమా ప్రభాస్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. దీన్ని మిస్ చేసుకున్నాడంటూ రవితేజ అభిమానులు ఇప్పటికీ బాధపడుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+