స్పిరిట్.. ప్రభాస్ నెవెర్ బిఫోర్ అవతార్: విడుదల తేదీ లాక్: సడన్ సర్ప్రైజ్
మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ.. స్పిరిట్. ఈ ఫిల్మ్ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది సెకెండాఫ్ లో విడుదల చేయనున్నట్లు యూనిట్ తెలిపింది. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమా నూతన విడుదల తేదీని ఇందులో పొందుపరిచారు.
ఈ మూవీ.. 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతోంది. మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతోండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అభిమానులు ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటోన్నారో.. దానికి మించి స్థాయిలో ఉంటుందంటూ మేకర్స్ చెబుతోన్నారు. రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో హైప్ క్రియేట్ అయింది.

అదే 2027 అక్టోబర్ 29 నాడే రామాయణ పార్ట్ 2 కూడా విడుదల కాబోతోంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలో థియేటర్లల్లో సందడి చేయనున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా త్రిప్తి డిమ్రీ నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలైన టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోన్నారు.
గతంలో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు ప్రదీప్ రెడ్డి వంగా. దీంతో ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న స్పిరిట్ పై ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సందీప్ వంగా మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్, ఎమోషన్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
Check this out........ 😊#Spirit#InSpiritMode@TSeries@VangaPictures #IndiasBiggestSuperStar29TH OCTOBER DIWALI 2027 💥Worldwide RELEASE DATE 👆 https://t.co/SmPjKHzuVE
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 18, 2026
2027 దీపావళి బరిని ఇప్పటినుంచే లాక్ చేయడం టాలీవుడ్ సహా బాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చిత్రీకరణ అనంతరం టెక్నికల్ గా విజువల్ వండర్ గా ఫైనల్ అవుట్ పుట్ ను తీసుకుని రావాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించడానికి వీలుగా ఈ లాంగ్ రిలీజ్ డేట్ను ఎంచుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
