తెలుగులో నెం.1 హీరో అతడే
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో "నెంబర్ వన్" స్థానం అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. గతంలో అయితే చాలాకాలం నిలిచేది. కానీ ఇప్పుడు సినిమాకు వచ్చే కలెక్షన్లను బట్టి, దానికి వచ్చే క్రేజ్ ను బట్టి రెండు సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాలు మాత్రమే ఏ హీరో అయినా నెంబర్ వన్ గా నిలబడగలుగుతున్నారుకానీ స్థిరంగా గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్నట్లుగా ఉండటంలేదు. కాలానికి అనుగుణంగా, సినిమాను బట్టి పొజిషన్ మారుతూ వస్తోంది. ఎప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఆ హీరోనే అప్పటికి నెంబర్ వన్. తర్వాత మళ్లీ మరో ఇండస్ట్రీ హిట్ వచ్చే వరకు అతని క్రేజ్ అలాగే నిలబడివుంటుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ మాత్రమే దేశంలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది విడుదలైన ఆర్మాక్స్ మీడియా సర్వేల ప్రకారం కూడా ఆయనే దేశంలో నెంబర్ వన్ హీరోగా స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రాజాసాబ్ ఫ్లాపైనా, కల్కి, సలార్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఆయనే నెంబర్ వన్ అని నిరూపిస్తున్నాయి. తర్వాత ఫౌజీ, స్పిరిట్, కల్కి2, సలార్ 2, ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఈ వరుస చూసినా ప్రభాస్ నెంబర్ వన్ స్థానానికి కొన్ని సంవత్సరాలపాటు ఢోకా లేదని అర్థమవుతోంది.

పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలు అయ్యారు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ బాబు పేరు అంతర్జాతీయస్థాయిలో వినపడుతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన స్థాయి ఎలా ఉంటుందో అభిమానులు కూడా ఊహించలేకపోతున్నారు.
వారణాసి విడుదలైన తర్వాత మహేష్ బాబు అంతర్జాతీయస్థాయిలో హాలీవుడ్ హీరో అవుతాడంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే అతని స్టైల్, ఆహార్యం కూడా అలాగే ఉంటుంది కాబట్టి. అగ్ర హీరోల్లో మాత్రం చిరంజీవి-బాలయ్య మధ్య మంచి పోరు నడుస్తోంది. తాజాగా చిరు మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ కొట్టగా, బాలయ్య అఖండ2తో అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయారు.












Click it and Unblock the Notifications