ప్రభాస్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రొమాంటిక్ క్లాసిక్స్‌లో 'Darling' ఒకటి. 2010లో విడుదలైన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించగా.. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కామెడీ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటివరకు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్, ఈ సినిమాతో సాఫ్ట్, లవర్ బాయ్ ఇమేజ్‌ను సంపాదించి, ముఖ్యంగా యువతలో భారీ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించి తన అందం, నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ప్రభు, చంద్రమోహన్ సహా పలువురు నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఇటీవల ఈ సినిమా విడుదలై 16 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులు థియేటర్లలో సందడి చేస్తూ, సినిమాను మరోసారి ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్, పాటలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రభాస్ చెల్లిగా, చంద్రమోహన్ కూతురిగా కనిపించిన నటి గురించి నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. ఆ పాత్రలో నటించిన నటి పేరు శిల్పా. ఆమె తన సహజ నటనతో ఆ పాత్రకు న్యాయం చేసినప్పటికీ, తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినీ రంగంలో కొనసాగలేకపోయారు.
అయితే 'డార్లింగ్' తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో కనిపించినా, స్టార్ స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది. దీంతో మెల్లగా ఇండస్ట్రీకి దూరమై వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె వివాహం చేసుకుని కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నట్లు సమాచారం. రీ-రిలీజ్ కారణంగా శిల్పా పాత ఫోటోలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చిన్న పాత్రలో కనిపించిన ఆమె గురించి ఇప్పుడు మళ్లీ చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది.
ఇక బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'.
పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అలానే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో సినిమా కూడా చేస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications