రీరిలీజ్ రికార్డుల్లో నిన్ను కొట్టేవాడు లేడన్నా..!

ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. కొత్త సినిమాల కంటే రీరిలీజ్ సినిమాలవైపే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన స్టార్స్ కు సంబంధించి ఎప్పుడు ఏ సినిమా మళ్లీ రిలీజ్ అవుతుందా అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ గా నిలిచిన డార్లింగ్ మూవీని ఇటీవల గ్రాండ్ గా రీరిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ రీరిలీజ్ లోనూ అదే హవా కొనసాగిస్తోంది. ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు జెన్ జీ కిడ్స్. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు హాలీడేస్ ఇవ్వడంతో డార్లింగ్ మూవీని చూసేందుకు ఎగబడుతున్నారు. దాంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.

ఇక ప్రభాస్ డార్లింగ్ మూవీకి మొదటి మూడు రోజుల్లో వచ్చిన గ్రాస్ వసూళ్లను చూస్తే ఫుల్ రన్ లో ఆల్ టైం రికార్డు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు రూ. 7 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలాగే ఒక్క నైజాం ప్రాంతం నుంచే ఈ సినిమాకు రూ. 3 కోట్ల 50 లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసుకున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే సీడెడ్ ప్రాంతంలో రూ. 43 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఏపీ నుంచి దాదాపు డార్లింగ్ చిత్రానికి రూ. 2 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Prabhas Darling Re-Release Crosses Expectations with Strong 3-Day Worldwide Collections Darling

తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు రూ. 75 లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లను ప్రభాస్ మూవీ రాబట్టినట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 7 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం. ఈ చిత్రం పవన్ కల్యాణ్ ఖుషి సాధించిన రూ. 7 కోట్ల 71 లక్షల రూపాయల గ్రాస్ మార్కుని దాటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+