'కన్నప్ప' నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్, ఇదేందయ్యా ఇలా ఉంది..!
మంచు విష్ణు ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తూ , నటిస్తోన్న సినిమా 'కన్నప్ప'. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు.. తిన్నడు పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మంచు విష్ణు తెలిపారు.ఈ సినిమా టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రభాస్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.తొలుత ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించారని తెలుస్తోంది. సినిమాలోని కీలక పాత్రలో ప్రభాస్ నటించారు.

ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు !! శివాజ్ఞా పరిపాలకుడు!!! అంటూ ప్రభాస్ పోస్టర్‌ను 'కన్నప్ప' యూనిట్ విడుదల చేశారు. అయితే ప్రభాస్ లుక్స్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది బాగుందని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ప్రభాస్ లుక్ ఆశించిన స్థాయిలో లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్పలోని ప్రభాస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.
— Zeke❌Rolex🚩 (@zeketweeetz) February 3, 2025
ॐ The Mighty 'Rudra' ॐ
— Kannappa The Movie (@kannappamovie) February 3, 2025
Unveiling Darling-Rebel Star 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 as '𝐑𝐮𝐝𝐫𝐚' 🔱, a force of divine strength, wisdom, and protector in #Kannappa🏹. ✨
Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.
Witness this epic saga on the big screen… pic.twitter.com/wcg7c3ulxd












Click it and Unblock the Notifications