స్టార్ హీరో ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. వీడియో వైరల్!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఊహించని ఫోన్ కాల్‌తో అవాక్కయ్యాడు. ఇది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త అవాక్కయ్యాడు. కేటీఆర్, ప్రభాస్‌కు సంబంధించిన ఓ సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రభాస్‌కు కేటీఆర్ చేసిన ప్రాంక్ కాల్ నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇటీవల "ది అండర్ 18 వరల్డ్" అనే యూత్ టాక్ షో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న పిల్లలు ఓ స్టార్ హీరోకు ఫోన్ చేయాలని కేటీఆర్‌ను కోరారు. వారి కోరిక మేరకు ఆయన వెంటనే ప్రభాస్‌కు కాల్ చేశారు. ప్రభాస్ కూడా వెంటనే స్పందించి గుడ్ ఈవెనింగ్ సార్.. అంటూ స్పందించారు. కానీ కేటీఆర్ బదులుగా పక్కనే కూర్చున్న ఓ పాప ఫోన్ అందుకుని.. "సార్.. నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఫోన్ దొరికింది. ఇందులో చూస్తే మీ ఫోన్ నెంబర్ కనిపించింది.. నేను ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా?"అని ప్రశ్నించింది.

కేటీఆర్ నంబర్ నుంచి ఫోన్ రావడం.. తీరా చూస్తే చిన్నారి వాయిస్ వినిపించేసరికి ప్రభాస్ వెంటనే కాల్ కట్ చేశాడు. ప్రభాస్ కాల్ కట్ చేయడంతో షోలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అనంతరం కేటీఆర్ తిరిగి ఫోన్ చేసి అది కేవలం సరదా కోసం చేసిన ప్రాంక్ అని.. తాను ప్రస్తుతం యువతతో కలిసి పాడ్‌కాస్ట్‌లో ఉన్నానని కేటీఆర్ అసలు చెప్పారు. తాను "ది అండర్ 18 వరల్డ్" పాడ్‌కాస్ట్ షోలో ఉన్నానని.. అక్కడున్న పిల్లల కోరిక మేరకు సరదాగా ఈ ప్రాంక్ చేశామని వివరించారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ నవ్వడంతో పాటు కాసేపు కేటీఆర్ తో ముచ్చటించారు. ఈ క్రమంలో ప్రభాస్‌ను కూడా ఈ షోలో పాల్గొనమని కోరగా.. ప్రభాస్ అంగీకరించినట్లు కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KTR and gang did a prank call to Prabhas 🤣🔥 pic.twitter.com/K3BBKFVjM9
— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) September 10, 2026














Click it and Unblock the Notifications
