ప్రభాస్ ఆరోగ్యంపై సర్జన్ ట్విస్ట్.. ఆ ఒక్క మాటతో అభిమానుల్లో ఆందోళన!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ఓ ప్రముఖ వైద్యుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వల్ల ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. 'స్పిరిట్', 'ఫౌజీ' వంటి భారీ చిత్రాల షూటింగ్ సమయంలో ప్రభాస్ పలుమార్లు గాయపడ్డారనే వార్తల నడుమ.. ఓ ఆర్థోపెడిక్ సర్జన్ పెట్టిన పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనితో ఆయన క్షేమ సమాచారం తెలుసుకునేందుకు అభిమానులు ఆరా తీస్తున్నారు.

Irumudi Movie Review: మాస్ మహారాజా ఖాతాలో పవర్ ఫుల్ హిట్.. క్లైమాక్స్ కన్నీళ్లే!
Irumudi Movie Review: మాస్ మహారాజా ఖాతాలో పవర్ ఫుల్ హిట్.. క్లైమాక్స్ కన్నీళ్లే!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పంచుకున్న ఆర్థోపెడిక్ సర్జన్
హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి.. ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. మోకాలు, తుంటి సమస్యలు, క్రీడా గాయాల నివారణలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ కేజే రెడ్డి.. ప్రభాస్‌తో ఉన్న ఫోటోకు 'విజయానికి మించిన స్ఫూర్తి' అని క్యాప్షన్ పెట్టారు. విజయవంతమైన వ్యక్తుల విజయం మాత్రమే బయటకు కనిపిస్తుందని..దాని వెనుక వారు చేసే వ్యక్తిగత త్యాగాలు ఎవరికీ తెలియవంటూ సందేశాన్ని జోడించారు.

Prabhas Health Update A social media post by an orthopedic surgeon Sparks Worry Among Fans

డాక్టర్ కేజే రెడ్డి ప్రశంసలు
తాను రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్య బాధ్యతలను చూసుకుంటున్నట్లు వెల్లడించిన డాక్టర్.. నటుడి వినయపూర్వకమైన స్వభావాన్ని కొనియాడారు. "కొందరు తమ విజయంతో స్ఫూర్తినిస్తే.. మరికొందరు తమ వినయ స్వభావంతో గాఢమైన ముద్ర వేస్తారు" అని డాక్టర్ పేర్కొన్నారు. అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ.. ప్రభాస్ ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి అని.. ఆయన సానుకూల దృక్పథం నిజంగా ప్రత్యేకమైనదని డాక్టర్ కొనియాడారు.

ప్రభాస్ అభిమానల్లో ఆందోళన
ఈ పోస్ట్ చూసిన వెంటనే ప్రభాస్ అభిమానులు కామెంట్ సెక్షన్లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. 'ప్రభాస్ అన్నకు ఏమైంది?', 'ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, సినిమాలు తర్వాత అయినా చేయవచ్చు' అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని, కాస్త విశ్రాంతి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అప్పుడే ఓటీటీలోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'..? ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
అప్పుడే ఓటీటీలోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'..? ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?

మోకాలి సమస్యలు.. వరుస సినిమాలు
ప్రభాస్‌కు గత కొన్నేళ్లుగా మోకాలి సమస్యలు వేధిస్తుండటంతో ఇప్పటికే రెండు సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. 'ఫౌజీ' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆయన మోకాలికి గాయమైందని.. దీనివల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', హను రాఘవపుడి దర్శకత్వంలో 'ఫౌజీ' చిత్రాల షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+