నేను పాకిస్తానీ కాదంటూ ప్రభాస్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా ఇంత వరకు అయితే మూవీ యూనిట్ నుంచి ఏ అప్డేట్ రాలేదు. ఈ సినిమాతో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్విని మూవీ నుంచి తొలగించాలనే సోషల్ మీడియా వేదికగా విమర్శలలు గుప్పిస్తున్నారు.
కారణం ఏంటంటే..
ఇమాన్వీ ఢిల్లీలో జన్మించినప్పటికీ.. ఆమె కుటుంబం పాకిస్థాన్ లోని కరాచీకి చెందినది అంటూ ఇంటర్నెట్ లో వివరాలు ఉన్నాయి. ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ ఒక పాకిస్తాన్ సైనిక అధికారి అని.. గతంలో ఆయన పాక్ ఆర్మీలో పని చేసి ఆ తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడినట్టు అందులో ప్రస్తావించారు. దాంతో జమ్మూకాశ్మీర్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో.. పాకిస్తాన్ కి చెందిన ఇమాన్వీని ప్రభాస్ సినిమాలో తీసేయాలని.. ఇండియన్ సినిమాల్లో ఆమెకు ఛాన్స్ ఇవ్వొద్దంటూ ట్రోల్ చేస్తున్నారు.

నేను పాకిస్తానీ కాదు..
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది ఇమాన్వీ. తాను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగ్గ భారతీయ అమెరికన్‌ని అంటూ ఒక ఎమోషనల్ లెటర్ ను పోస్ట్ చేసింది. ఈ మేరకు ఈ లెటర్లో.. పహల్గాంలో జరిగిన విషాద సంఘటన పట్ల హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాననని వెల్లడించింది. మృతులకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని వ్యక్తపరిచింది. ఈ తరహా హింసాత్మక చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది.
అంతే కాకుండా తనకు పాకిస్థాన్ తో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఇమాన్వీ. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన కుటుంబంలో ఎవరూ పాకిస్తాన్ సైన్యంతో ఏ విధంగానూ సంబంధం కలిగి లేరని చెప్పింది. తన తల్లిదండ్రులు యవ్వనంలో చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చిన తర్వాత తాను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించానని పేర్కొంది. USAలో విద్యను పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డాన్సర్ గా వృత్తిని కొనసాగించానని తెలిపింది.
ఆ తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే అవకాశం వచ్చిందని.. అందుకు తాను చాలా కృతజ్ఞుతతో ఉన్నట్టు వివరించింది. తన రక్తంలో ఇమిడి ఉన్న భారతీయ మూలాలను, సంస్కృతిని కలిగి ఉన్నానని తెలిపింది. దీంతో ఈమెపై వస్తున్న ట్రోల్స్ కిక్ హెక పడిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications