ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బాహుబలి మూవీకి ముందు.. తర్వాతగా ఆయన కెరీర్ మారింది. అప్పటి వరకూ తెలుగులో స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియాలోనే నెం. 1 హీరో స్థానానికి చేరారు. బాహుబలి తర్వాత వచ్చిన ఆయన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యాయి. హిట్, ప్లాఫ్ తో సంబంధం లేకుండా వందల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాయి.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజాసాబ్ మూవీతో థియేటర్లలో సందడి చేశారు ప్రభాస్. ఈ మూవీ ఆశించినంత విజయం సాధించినప్పటికీ ప్రభాస్ స్టార్డమ్ కారణంగా కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5 న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.

హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. అలాగే హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Prabhas Instagram Following Here s the Only Telugu Hero the Global Star Follows on Social Media

అయితే ప్రభాస్ కు ప్రస్తుతం ఇన్ స్టా లో 13.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన కేవలం 28 మందినే ప్రస్తుతం ఫాలో అవుతున్నారు. అందులో కేవలం ఒకే ఒక తెలుగు హీరోను ప్రభాస్ ఫాలో అవుతున్నారు. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ లెజెండరీ హీరో, ప్రభాస్ పెదనాన్న దివంగత కృష్ణంరాజు. ఆయన 2022 లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్- కృష్ణంరాజు బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణంరాజు చివరగా ప్రభాస్ రాధేశ్యామ్ మూవీలో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+