గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..వదినమ్మ రాబోతుందంటూ పోస్ట్

ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టు అనుష్క, ప్రభాస్‌ రిలేషన్ ఉన్నట్టు కనిపించింది. బాహుబలి తరువాత అనుష్క సినిమాలకు దూరం ఉంది.

ప్రభాస్‌తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా.

Prabhas instagram post goes viral

కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అయితే కృతి సనన్‌ వేరే వ్యక్తితో రిలేషన్‌తో ఉండటంతో ప్రభాస్‌తో ఎఫైర్ కేవలం రూమర్ అని తేలిపోయింది. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రభాస్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. డార్లింగ్స్ మొత్తానికి నా జీవితంలో స్పెషల్ రానే వచ్చింది.. వెయిట్ చేయండి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రభాస్ రాసుకొచ్చారు. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పబోతున్నారని ఫిక్స్ అయ్యారు.ఎందుకంటే ప్రభాస్ తన సినిమాల గురించి పెద్దగా ఎప్పుడు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దీంతో ప్రభాస్ కచ్చింతంగా తన పెళ్లి గురించి చెప్పడానికి సిద్దమైయ్యారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరీ డార్లింగ్ ప్రభాస్ ఏం చెబుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+