ఆయన వల్లే పెళ్లికి దూరంగా ఉన్నా - ప్రభాస్

ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టు అనుష్క, ప్రభాస్‌ రిలేషన్ ఉన్నట్టు కనిపించింది. బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. ప్రభాస్‌తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా. కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు.

prabhas interesting comments on marr

బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. ప్రభాస్ 'నా ఉచ్ఛ్వాసం కవనం'అనే కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పెళ్లి గురించి రకరకాల పాటలు రాశారని, 'మనీ' మూవీలో భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ అని పాట రాశారని.. ఆ పాటలో వివాహం చేసుకోవద్దన్నారని..కొన్ని చిత్రాల్లో పెళ్లి గురించి చాలా గొప్పగా రాశారని.. మరీ నేను ఇప్పుడు వివాహం చేసుకోవాలా? వద్దా? అంటూ ప్రభాస్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. సలార్-2, కల్కి -2, సినిమాలతో పాటు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+