'కల్కి' అక్కడ అట్టర్ ఫ్లాప్!
'కల్కి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదుచేస్తూ ముందుకు దూసుకుపోతోంది. బాహుబలి తర్వాత హిట్ కోసం వేచిచూస్తున్న తరుణంలో సలార్ మంచి హిట్ ఇచ్చి అభిమానులను ప్రసన్నులను చేసింది. తర్వాత వచ్చిన కల్కి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఒక్క అమెరికాలోనే మొదటిరోజు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రానున్న మూడు నాలుగు రోజుల్లో మరిన్ని వసూళ్లు వసూలు చేయడం ఖాయంగా కనపడుతోందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఆ రెండు చోట్ల నిరాశ పరిచింది
కల్కి 2898ఏడీ పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ప్రభాస్ కు ఎలాగూ తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అయితే మిగతా భాషల్లో కూడా అదేస్థాయిలో కలెక్షన్లు సాధించాలనే లక్ష్యంతో ప్రభాస్ ఉన్నారు. కల్కి తెలుగు, కన్నడం, హిందీలో బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. అయితే తమిళం, మళయాళంలో మాత్రం చిత్ర యూనిట్ ను నిరాశపరిచింది. తమిళంలో రూ.4 కోట్లు, మళయాళంలో రూ.2.2 కోట్లను కల్కి రాబట్టింది.

కమల్ హాసన్ ఉన్నప్పటికీ..
తమిళంలో ఈ సినిమా దారుణంగా రూ.4 కోట్లు వసూలు చేయడంపై ట్రేడ్ పండితులు నివ్వెర పోతున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటించారు. అయితే కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్ లో రాలేదు. నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం తమిళనాడులో ఎక్కువగా ప్రమోషన్లు నిర్వహించలేదు. ప్రస్తుతం అదే కారణమవ్వొచ్చని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడంతోపాటు ప్రచారం ఎక్కువగా చేస్తే అభిమానులు భారీగా ఊహించుకుంటున్నారని, సినిమా బాగున్నప్పటికీ వారి అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో వాటిని చేరుకోవడం కష్టంగా ఉంటోందని, దీనివల్ల బాగున్న సినిమా కూడా ఫ్లాపవ్వాల్సి వస్తోందని కల్కి చిత్ర యూనిట్ చెబుతోంది.












Click it and Unblock the Notifications