తొడ కొట్టి ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టిన 'కల్కి'
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం సంచలన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు నిర్మాత సి.అశ్వనీదత్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ వరకు ఎటువంటి సినిమాలు విడుదల కాకపోతుండటంతో అప్పటివరకు ఈ సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంమీద రూ.1200 కోట్ల దగ్గర ఆగే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కల్కి మరో సంచలన రికార్డును నెలకొల్పింది.
బాహుబలి2 రికార్డు బద్దలు
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 రూ.1850 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. అందులో నేపాల్ నుంచి రూ.23 కోట్లు రాబట్టింది. అయితే తాజాగా కల్కి ఈ రూ.23 కోట్ల రికార్డును బద్దలు కొట్టింది. బాహుబలి2 తర్వాత ఎన్నో సినిమాలు ప్రయత్నించినప్పటికీ ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా అధిగమించే అవకాశం ఉందని భావించినప్పటికీ ఆ సినిమా సాధించలేదు. తాజాగా కల్కి ఆ రికార్డును బద్దలుకొట్టి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దాదాపుగా రూ.25 కోట్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పురాణాలకు, సైన్స్ ఫిక్షన్ కు లింకు
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం కల్కిలో పాలుపంచుకుంది. సైన్స్ ఫిక్షన్ కథను పురాణాలకు ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానం సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అమితాబ్ పాత్రకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ చిత్రంతోపాటు స్పిరిట్, సలార్2 చిత్రాలు చేయాల్సివుంది. ఇవి పూర్తయిన తర్వాత కల్కి2 పట్టాలెక్కే అవకాశం ఉంది. మొదటి భాగాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రెండో భాగానికి ఎంత ఖర్చుపెడతారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications