'కల్కి' కలెక్షన్ల భీభత్సం.. ప్రభాస్ మాస్ జాతర
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కల్కి చిత్రం 32వ రోజు కూడా భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఆదివారం కలిసిరావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు 70 శాతం నిండాయి. కొన్నిచోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి లాంటి నగరాల్లో కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ తో నడుస్తుండటంతో అందరూ ప్రభాస్ స్టామినాకు ఆశ్చర్యపోతున్నారు. సామీ నువ్వు శిఖరం కాదు.. పర్వతానివంటూ అభిమానులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఏ సినిమా విడుదలైనా రెండు వారాలు లేదంటే మూడువారాలకు కలెక్షన్లు కొల్లగొట్టి దుకాణాన్ని మూసేస్తాయి.
నిలకడగా కలెక్షన్లు
కానీ కల్కి మాత్రం ఇప్పటికీ నిలకబడగా కలెక్షన్లు రాబడుతోంది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.372 కోట్లను రాబట్టాలి. కానీ ఇప్పటికే కల్కి బ్రేక్ ఈవెన్ అధిగమించి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటివరకు రూ.156 కోట్ల లాభాన్ని అందించింది. నిర్మాత అశ్వనీదత్ కు ఈ సినిమా వల్ల ఇప్పటివరకు రూ.125 కోట్లకు పైగా లాభం వచ్చింది. త్వరలోనే ఈ సినిమా జపాన్ లో కూడా విడుదలవుతోంది. అక్కడ వచ్చే కలెక్షన్లతో కల్కి భారీ లాభాలను ఆర్జించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రూ.1150 కోట్లు దాటి.. రూ.1200 కోట్ల దిశగా
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తొలిసారిగా అమెరికాలో రూ.100 కోట్లు సాధించిన సినిమాగా నిలవబోతోంది. మరో వారం రోజుల్లో కల్కి అమెరికాతోపాటు ఇతర దేశాలన్నీ కలిపి 20 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోబోతోంది. అన్నిచోట్ల కన్నా హిందీలో మాత్రం ఈ సినిమా దుమ్ము దులిపేసింది.
ఇప్పటివరకు రూ.323 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా రూ.160 కోట్ల షేర్ ను అందించింది. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ హోదాతో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతున్న ప్రభాస్.. భవిష్యత్తులో విడుదలయ్యే సినిమాలు కూడా ఈ తరహా కలెక్షన్లు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా హీరోగా, దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ మరోసారి తన క్రేజ్ ను, స్టామినాను నిలుపుకున్నాడంటున్నారు.












Click it and Unblock the Notifications