KALKI 2898 AD: కల్కి ట్విట్టర్ రివ్యూ.. సినిమాకు అదే మైనస్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇండియాలో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యూఎస్‌లో మాత్రం ఒకరోజు ముందే విడుదలైంది.మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్ భారీ ఎత్తున నిర్మించారు.హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. తాజాగా ఈ సినిమా చూసిన కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి కల్కి ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కల్కి చూసిన కొందరు సినిమా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు హాలీవుడ్ లేదు అంతా ప్రభాసే అంటూ సినిమా చూసిన ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని, రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు.
"Tollywood ledhu Bollywood ledhu REBELwood anthe"
— Ayyo (@AyyoEdits) June 27, 2024
"2000 Crores, Hollywood level & World Blockbuster"
JAI REBEL STAR 🔥🔥🔥 #Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan pic.twitter.com/pmAJoxFEaY
తమిళ అభిమానుల నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. సినిమా మరో లేవల్లో ఉందని.. కానీ డబ్బింగ్ అంతగా సెట్ కాలేదని అదొక్కటే మైనస్ అని ఓ మహిళ అభిమాని తెలిపారు. సెకండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు.
Tamilnadu 1st show #Kalki2898AD public review blockbuster.!!💥#BlockbusterKalki #Prabhas #Kalki2898AD pic.twitter.com/57VSOB5h5S
— ᴊ ᴇ ʀ ᴏ ᴍ ᴇ (@JudeJerome07) June 27, 2024
చివరి అర్థగంట సినిమాను ప్రభాస్ అరిపించేశాడని , కల్కి బ్లాక్ బ్లస్టర్ హిట్ అని ఓ తమిళ అభిమాని తెలిపాడు. కమల్ హాసన్, అమితాబ్ నటన అద్భుతంగా ఉందని సినిమా చూసిన ఓ పెద్దాయన తెలిపారు. లోపల వేరే ప్రపంచం చూపించారన్న సినిమా సూపర్ అంటూ యూత్ చెప్పుకొచ్చారు.
#Kalki2898AD Day 1 Public Reviews 🔥✅
— 𝘚𝘸𝘦𝘵𝘩𝘢™ (@Swetha_little_) June 27, 2024
Tamil Audiences blockbuster movie ❤️🔥#BlockbusterKalki 💥💥🤘🤘
#Prabhas pic.twitter.com/ckqnhpRyql
బాలీవుడ్‌లో కూడా కల్కి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ నటనకు నార్త్ జనాలు ఫిదా అవుతున్నారు. కల్కి అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన ఇరగదీశాడంటూ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీపిక పదుకునే వావ్ అనిపించేలా నటించిందని ఓ మహిళ అభిమాని తెలిపారు.
98. #Kalki28989AD DAY 1 MORNING PUBLIC RESPONSE !🔥🥵
— TBH REVIEW (@arnikhazra4) June 27, 2024
BLOCKBUSTER RESPONSE ALL OVER FROM AUDIENCE & THE WORD MOUTH IS QUITE POSITIVE FROM EVERYONE 🥹👍#Prabhas | #Kalki2898ADonJune27 | #BlockBusterKALKI | #BlockBusterKalki2898AD | #NagAshwin | #AmitabhBachchan | #KamalHaasan pic.twitter.com/dcPo2EKtTU












Click it and Unblock the Notifications