ఆ సీన్ చూసి ఏడ్చేశా.. ప్రభాస్ ఎమోషనల్ !

రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్‌ వరల్డ్‌ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో సినిమా కూడా చేస్తూ బిజీగా ఉన్నారు.

prabhas-latest-video-got-viral-on-social-media-that-interactions-with-nag-aswin-about-sing-geetham-m

కాగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సరికొత్త మ్యూజికల్ మ్యాజిక్ "సింగ్ గీతం". రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ - ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అందులో ప్రభాస్ షూటింగ్ గ్యాప్‌లో 'సింగ్ గీతం' సినిమా చూసి నాగ్ అశ్విన్‌కి కాల్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగీతం జీనియస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరో చెట్టు దగ్గరికి వెళ్లే ఒక ఎమోషనల్ సీన్ చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సింగీతం ఒక వాయిస్ మెసేజ్ పెడుతూ.. "సార్, ఇప్పుడే సినిమా చూశాను. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఎవర్ సార్.. హాట్సాఫ్" అని తన గౌరవాన్ని చాటుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+