టీమిండియా కోచ్ రాజీనామా..! బీసీసీకి సమాచారం..!

ఒక అడుగు ముందుకు, రెండు అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతున్న టీమిండియా (team india) ఆటతీరు ప్రభావం టీమ్ మేనేజ్మెంట్ పైనా పడుతోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ బృందం శిక్షణలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లిన టీమిండియాకు రెండు చోట్లా నిరాశ తప్పలేదు. ఐర్లాండ్ లో టీ20 సిరీస్, ఇంగ్లండ్ లో టీ20, వన్డే సిరీస్ లు కోల్పోయిన టీమ్ ప్రస్తుతం సహాయ కోచ్ (Assistant Coach)గా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) గుడ్ బై చెప్పేశాడు.

హార్ధిక్ పాండ్యా కోసం రేసులో 7 ఐపీఎల్ ఫ్రాంచైజీలు..! లైట్ తీసుకున్న ఆ రెండూ..!
హార్ధిక్ పాండ్యా కోసం రేసులో 7 ఐపీఎల్ ఫ్రాంచైజీలు..! లైట్ తీసుకున్న ఆ రెండూ..!

భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషెట్ తన పదవి నుంచి తప్పుకున్నారని క్రిక్‌ఇన్‌ఫో తమ కథనంలో పేర్కొంది. భారత్ టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోయిన యూకేలోనే టెన్ డస్కటే తన నిర్ణయం గురించి బోర్డుకు తెలియజేశారని ఆ నివేదిక తెలిపింది. ఆయన తదుపరి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ లో కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నారని కూడా ఆ నివేదిక వెల్లడించింది. బోర్డుతో టెన్ డస్కటే కుదుర్చుకున్న ప్రాథమిక ఒప్పందం ముగియడంతోనే ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ ఒప్పందం జూలై 2024 నుండి జూలై 2026 మధ్యకాలానికి చేసుకున్నా.. ముందే ముగిసింది.

India Assistant Coach Resigns After England Series Defeat BCCI Informed Report
IPL 2027: హార్ధిక్ కోసం ఆయుష్ కు సీఎస్కే నో..! బదులుగా ముంబైకి ఆఫర్ ఇదే..!
IPL 2027: హార్ధిక్ కోసం ఆయుష్ కు సీఎస్కే నో..! బదులుగా ముంబైకి ఆఫర్ ఇదే..!

2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక, టెన్ డస్కటే భారత సహాయక సిబ్బందిలో చేరారు. గంభీర్‌కు అత్యంత నమ్మకస్తులలో ఒకరిగా భావించే ఈ మాజీ ఆల్-రౌండర్.. జట్టుకు బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలకు సేవలు అందించాడు. ఆయన పదవీకాలంలో భారత్ వైట్-బాల్ క్రికెట్‌లో మంచి విజయాలను సాధించింది. 2025 ఆసియా కప్‌, 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ గెల్చుకుంది. అదే సమయంలో టెస్టు జట్టు ఓటములు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా టూర్ లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0, దక్షిణాఫ్రికాతో 2-0 తేడాతో ఓడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+