పెళ్లిపై కీలక ప్రకటన చేసిన ప్రభాస్
ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టు అనుష్క, ప్రభాస్ రిలేషన్ ఉన్నట్టు కనిపించింది. బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. ప్రభాస్‌తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా. కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు.

బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి.తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురుని పెళ్లి చేసుకోబోతున్నాడని, పెద్దమ్మ శ్యామలాదేవి పెళ్లి పనులను చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన టీం స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీం తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, దయచేసి పుకార్లు నమ్మకండి' అంటూ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ పెళ్లిపై వస్తోన్న వార్తల్లో ఎలాంట నిజం లేదని తేలిపోయింది. దీంతో ప్రభాస్ పెళ్లిపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.ప్రభాస్ ప్రస్తుతం సలార్-2,ఫాజీ, కల్కి-2 ,సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆయన నటిస్తూన్న రాజాసాబ్ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయింది.ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications