ప్రభాస్ 'ఫౌజీ' నుంచి 1 మినిట్ వీడియో లీక్.. ఇంటర్నెట్ షేక్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'ఫౌజీ' ఒకటి. సీతారామం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రీ- ఇండిపెండెన్స్ ఎరా కు సంబంధించిన స్టోరీతో వాస్తవ కథనాలను మేళవించి ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ పలు కారణాలతో ఫౌజీ మూవీ వాయిదా పడింది.
తదుపరి రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడి కానుంది. అయితే దేశభక్తి తరహా చిత్రం కావడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న వస్తుందేమోనని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ఫౌజీ మూవీ నుంచి సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి ఓ వన్ మినిట్ వీడియో బయటకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియో క్లిప్ సినిమా లో ఉందా.. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వీడియోలో జవాన్లంతా ఒక చోట చేరి తుపాకులు చేతిలో పట్టుకుని సరదాగా.. ఉత్సాహంతో డాన్సులు చేస్తున్నారు. ఏదో పాటకు ఈ ఆర్మీ క్యాంప్ లో తుపాకులతో డాన్సులు చేస్తూ కనిపించారు. మొత్తం ఒక నిమిషం 9 సెకన్లపాటు ఈ వీడియో రన్ టైమ్ ఉంది. మరి ఇది రియలా ఫేకా అనేది తెలియాల్సి ఉంది. వందలాది మంది జవాన్లు ఇలా నృత్యాలు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఫౌజీ మూవీ 1940 ల కాలం నాటి పీరియాడికల్ మూవీగా రూపొందుతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ను బట్టి తెలుస్తోంది.
The Leaked Footage of #Fauzi Movie 📈📈🔥#Prabhas accidentally Shared this clip on his Instagram Story & suddenly Deleted it🔥 https://t.co/OT3LYtpo7T
— Prabhas Fan (@Itsaprank132511) October 5, 2026
ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉంటుందని సమాచారం. ఫౌజీలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications
