పెళ్లిపై హింట్ ఇచ్చిన ప్రభాస్
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఒక్కటే. ఏమిటంటే.. పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ వివాహం. ఈనెల 23వ తేదీతో 45వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తాకథనాలు వచ్చేవి. ఒక్కోసారి డార్లింగ్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా చూస్తున్నామని, త్వరలోనే అని, ప్రభాస్ ఇష్టమని, అన్నీ కుదిరితే పెళ్లే తరువాయి అని చెప్పేది. తీరా చూస్తే అవేవీ జరిగేవి కాదు. ప్రభాస్-అనుష్క ప్రేమించుకున్నారని, జంట బాగుంటుందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మరోవైపు వార్తలు వస్తుంటాయి.
స్నేహితులమేనని చెప్పిన డార్లింగ్
అయితే అటువంటిదేమీ లేదని, తామిద్దరం కేవలం స్నేహితులమేనని ప్రభాస్ స్పష్టం చేశాడు. బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరైనప్పుడు గట్టిగా పట్టుబడితే అమ్మాయి దొరకడంలేదని ఒకసారి, సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాత తాను చేసుకుంటానని చెప్పాడు. ఆదిపురుష్ సినిమా చేసే సమయంలో కృతిసనన్ తో ప్రేమలో పడ్డాడని, నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారని, వివాహం చేసుకోవడమే తరువాయి అంటూ వార్తలు వచ్చాయికానీ అవేవీ నిజం కాలేదు. దీంతో డార్లింగ్ అభిమానులు తమ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ తన పెళ్లిపై హింట్ ఇచ్చారు. జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది.

అమ్మాయిలతో చిట్ చాట్ లో పాల్గొంటూ..
ఇటీవల ప్రభాస్ కొందరు అమ్మాయిలతో చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో అమ్మాయిలు ప్రభాస్ ను మీరు అమ్మాయిల హృదయాలను బద్ధలు చేసేదెప్పుడు? అని అడిగారు. అంటే దానికి అర్థం ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అమ్మాయిల మనసులు బద్ధలవుతాయని అర్థం. దానికి డార్లింగ్ సమాధానమిస్తూ తనకు అమ్మాయిల హృదయాలను బద్దలు కొట్టడం తనకు ఇష్టం లేదని, వారి హృదయాలను ఎప్పటికీ బద్దలు కొట్టనని చెప్పాడు. దీన్నిబట్టి జీవితంలో అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని డార్లింగ్ చెప్పినట్లైంది. దీంతో అందరికీ ఒక స్పష్టత వచ్చింది. ఇకనైనా ప్రభాస్ పెళ్లి రేపో, మాపో జరుగుతోందని, పెళ్లికూతురు ఆమేనంటూ వచ్చే వార్తలను ఆపాలని డార్లింగ్ అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications