'ది రాజా సాబ్' ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఏ ప్లాట్ ఫామో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో.. మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీ ది రాజా సాబ్.. హారర్, కామెడీ, ఫ్యాంటసీ మిక్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు రెడీ అవుతోంది. జనవరి 9 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ తో పాటు టీజర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత డార్లింగ్ ను మళ్లీ తెరపై ఈ విధంగా చూసే అవకాశం ఈ సినిమాతో దొరకనుందంటూ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వింటేజ్ లుక్ లో ప్రభాస్ స్టైలిష్ గా ఉన్నాడంటూ.. రెబల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాజా సాబ్ సినిమా రిలీజ్ కు ఒక నెల ముందే ఓటీటీ ఒప్పందం పూర్తయినట్లు సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, రెబల్ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇక మరోవైపు ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ చిత్రీకరణ ఇటీవల ప్రారంభం అయింది. అలాగే ఫౌజీ చిత్రం కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications