ప్రభాస్ "రాజా సాబ్" స్టోరీ లీక్.. ఇదేందయ్యా ఇది !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్" మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిసన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
రీసెంట్ గానే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్, హీరోయిన్ల గ్లామర్ యాడ్ అప్ అని చెప్పాలి. వీఎఫ్ఎక్స్, బీజీఎం అదిరిపోగా.. కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండియర్‌ను చూపించాయి. దీంతో మూవీపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే "రాజా సాబ్" సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమ వెర్షన్స్ పోస్ట్ చేస్తుండగా.. ఓ నెటిజన్ అయితే ఏకంగా రాజాసాబ్ స్టోరీ ఇదేనంటూ మొత్తం కథంతా చెప్పేశాడు. దీంతో అందుకు సంబంధించిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది.
లీకైన స్టోరీ ఏంటంటే..?
హీరో ప్రభాస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా తాను ఓ కోటకి వారసుడినని తెలుస్తుంది. అప్పటికే ఒక హీరోయిన్‌లో లవ్‌లో ఉండగా.. కోటలోకి వెళ్లిన తర్వాత నిధుల కోసమే వచ్చిన మరో హీరోయిన్ కలుస్తుంది. అలానే కోట దగ్గర జమీందార్ల వారసురాలిగా మరో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత వారంతా కోటలోకి వెళ్లిన తర్వాత తన తాత గురించి తెలుసుకుని బాధపడుతుంటాడు.
ప్లాష్‌బ్యాక్‌లో ప్రభాస్ తాత అయిన రాజాసాబ్‌కి సంజయ్ దత్ నమ్మించి చంపేసి ఆ ఆస్తినంతా తానే అనుభవించాలన్న కోరికతో క్షుద్రపూజలు చేయించి చచ్చిపోతాడు. పగ, ప్రతీకారంతో రాజాసాబ్ ఆ కోటలనే దెయ్యమై తిరుగుతుంటాడు. చివరికి క్లైమాక్స్ ఫైట్‌లో సంజయ్ దత్ దెబ్బకి ప్రభాస్ పడిపోతే రాజా సాబ్ తాత అతడి శరీరంలోకి ప్రవేశించి విలన్‌ని అంతమొందిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
#rajasaab story reveal 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/k5ve470jk1
— Fear 🇮🇳 🤵🏻 (@mps2j2024) June 17, 2025
-
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications