"మిరాయ్" కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా..?

యంగ్ హీరో తేజా సజ్జా.. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో "మిరాయ్" అనే చిత్రంలో నటించారు. ఇందులో విలన్ గా మంచు మనోజ్ నటించగా.. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా చేసింది. సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ తో పాటు.. జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా మొదటి రోజే రూ.27 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

prabhas-remuneration-for-teja-sajja-mirai-movie-goes-viral

అయితే ఈ మూవీకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా స్టార్టింగ్ ఆయన వాయిస్ ఓవర్ తోనే ప్రారంభం అవుతుంది. దీంతో డార్లింగ్ రెమ్యూనరేషన్ ఎంత అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏఐ ఉపయోగించి ప్రభాస్ వాయిస్ ని ఉపయోగించినందుకు గాను ప్రభాస్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చింది అనే విషయం వైరల్ గా మారింది.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తో ప్రభాస్ కి ఉన్న రిలేషన్ కారణంగా ఆయన ఒక రూపాయి కూడా తీసుకోలేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. అందుకే ఆయన డబ్బులు తీసుకోలేదని.. ఫ్రెండ్స్ కోసం ప్రభాస్ ఏదైనా చేస్తాడు అనడానికి ఇదో ఉదాహరణ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌ తో కల్కి - 2 , ప్రశాంత్‌ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. మరి రాబోయే చిత్రాలతో మరెన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+