ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..చివరి నిమిషంలో షాక్
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్.. మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమా టికెట్ల బుకింగ్ మొదలైంది. తొలి టికెట్‌ను స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి కొన్నారు. ఫ్రీగా మాత్రం కాదు. ఏకంగా 10,116 రూపాయలు పెట్టి మరీ టికెట్ కొన్నారాయన. హీరోలు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీస్ సునీల్ ఎర్నేని ఈ టికెట్‌ను ఆయనకు అందజేశారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో ఈ సినిమాను చూడబోతోన్నారు రాజమౌలి. ఆయనకు కేటాయించిన సీట్ నంబర్ ఏ1. ఆయనతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, సునీల్ ఎర్నేని కలిసి సినిమా చూసే అవకాశం ఉంది.
#Salaar release trailer tomorrow
— Indian Cinema Hub (@IndianCinemaHub) December 17, 2023
💥💥💥#Prabhas #SalaarCeaseFire #SalaarReleaseTrailer pic.twitter.com/ktw7vTWt6b
ఈ సాయంత్రం సలార్ మూవీ ట్రైలర్ (Salaar trailer) విడుదల కావాల్సి ఉంది. దీనికోసం లక్షలాది మంది ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేసింది సినిమా యూనిట్. 18వ తేదీ అంటే సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిపింది.
#salaar trailer release tomorrow due to technical issues
— hemanth meneni 123 (@Meneni123) December 17, 2023
సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అంతకుమించి గల కారణాలు ఏమిటనేది తెలియరావట్లేదు. సోమవారం సాయంత్రం సలార్ ట్రైలర్‌ను విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ హొంబలె ఫిల్మ్స్ వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications