రాజు ఎక్కడున్నా రాజేరా..
సీనియర్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమాలో ఉన్నా తనదైన శైలిలో డైలాగులు చెప్తూ నవ్వులు పూయిస్తారు. అయితే గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కిడ్నీలు పాడై వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఫిష్ వెంకట్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదుకున్నారు.

అటు ఇండస్ట్రీ అయినా ఇటు ఫ్యాన్స్ అయినా కష్టం వచ్చిందంటే ముందుంటే నటుల్లో ప్రభాస్ ఒకరు. తాజాగా మరోసారి ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కిడ్నీలు పాడై వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ కు అండగా నిలిచారు. చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఫిష్ వెంకట్ కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కు డోనర్ ఉంటే సిద్ధం చేసుకోమని.. ఆపరేషన్ కి అవసరమైన ఖర్చంతా ప్రభాస్ అందిస్తారని ఆయన టీమ్ ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి వివరించారు.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రభాస్ సాయం విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. రాజు ఎక్కడున్నా రాజేరా, రాజంటే రెబలేరా రెబల్ అంటే రాజేరా అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
అటు టాలీవుడ్ ప్రముఖుల్లో పలువురు సైతం ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్.. త్వరగా కోలుకుని మరిన్ని సినిమాల్లో నటించాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications