అనుష్కకి, నాకు పెళ్లి కావాల్సిందే... ఓపెనైనా ప్రభాస్

ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టు అనుష్క, ప్రభాస్‌ రిలేషన్ ఉన్నట్టు కనిపించింది. బాహుబలి తరువాత అనుష్క సినిమాలకు దూరం ఉంది.

ప్రభాస్‌తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా.

Prabhas s Post for Anushka Sparks Marriage Rumors Again Will They Ever Stop

కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అయితే కృతి సనన్‌ వేరే వ్యక్తితో రిలేషన్‌తో ఉండటంతో ప్రభాస్‌తో ఎఫైర్ కేవలం రూమర్ అని తేలిపోయింది. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పటికే చాలానే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలానే కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే అవన్నీ కూడా కూడా ప్రచారాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. తమ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు ఈ జంట. ప్రభాస్ ఇటీవల పోస్ట్ చేసిన పోస్ట్‌తో ఇది మరోసారి రుజువు అయింది.

అనుష్క తాజాగా నటించిన చిత్రం 'ఘాటి'. ఈ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా అనుష్క సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఘాటి ట్రైలర్ అద్భుతంగా ఉంది. మీ పవర్ ఫుల్ లుక్ ఆకట్టుకుంది. సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మూవీ టీమ్ కు నా శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీరి బంధం గురించి మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై గతంలో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ రూమర్స్ ఆగాలంటే నాకో, అనుష్కకో పెళ్లి కావాల్సిందే అని, అప్పటి వరకు ఇది ఆగదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+