ప్రభాస్ 'రాజాసాబ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాజాసాబ్' చిత్రం తాజాగా సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి సుమారుగా 3 గంటల 10 నిమిషాలు ఉంది. అంటే సుమారుగా 190 నిమిషాల రన్ టైమ్ తో ఈ మూవీ ఉండనుంది. ఇక జనవరి 9న సంక్రాంతికి ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్'.. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. మూవీ రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. అయితే మూవీని సెన్సార్ చేసిన అధికారులు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే మూవీని చూడొచ్చు. అయితే 16 ఏళ్లకు లోబడి ఉండే వాళ్లు మాత్రం తల్లిదండ్రులు పర్యవేక్షణలో వారి మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక రాజాసాబ్ మూవీ తాత మనవడు, నానమ్మ మనవడు మధ్య జరిగే కథగా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ లో స్వల్ప మార్పులు చేయాలని సూచనలు చేశారు. వారి సూచనల మేరకు టీమ్ కొన్ని సవరణలు చేసింది. దాంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఈ సినిమా క్లియరెన్స్ లభించింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక మూవీకి వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాక కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. దాదాపు 45 నిమిషాల పాటు క్లైమాక్స్ సాగుతుంది అని సెన్సార్ రివ్యూ ద్వారా స్పష్టం అవుతోంది.

ఇక ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. థమన్ సంగీతం అందించారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో ప్రేక్షకులు చూడనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కానుంది. అయితే జనవరి 8న ప్రీమియర్లు ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!












Click it and Unblock the Notifications