ఇన్నాళ్లుకు బయటపడ్డ ప్రభుదేవా-నయనతార బ్రేకప్ వెనుక అసలు కథ
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ.
ముఖ్యంగా ప్రభుదేవాను నయనతార చాలా డీప్‌గా ప్రేమించింది. అతనితో వివాహానికి కూడా రెడీ అయింది. నయనతారతో గాఢమైన ప్రేమలో మునిగిపోయిన ప్రభుదేవా తన భార్యకు సైతం విడాకులు ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, సడన్‌గా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారో అన్నది పెద్దగా బయటకు రాలేదు. ఇన్నాళ్లకు ప్రభుదేవా, నయనతార విడిపోవడానికి గత కారణం బయట పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుదేవా తీరు వల్లే వీరిద్దరు విడిపోయారని తెలుస్తోంది.

నయనతారకు ప్రభుదేవా చాలా కండిషన్లు పెట్టేవారని కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. క్రిస్టియన్‌గా ఉన్న నయనతారను ప్రభుదేవా తన మతంలోకి మారాలని కోరాడట. అందుకు నయనతార అంగీకరించారట. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని.. హౌస్ వైఫ్ గా మారిపోవాలని ప్రభుదేవా కండీషన్ పెట్టాడట. అయితే అందుకు మాత్రం నయనతార ఒప్పుకోలేదు. మ్యారేజ్ తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తానని.. కావాలంటే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని నచ్చజెప్పే ప్రయత్నిడం చేసిందట.
అదే విధంగా తన మొదటి భార్య పిల్లలు కూడా మనతోనే ఉంటారని ప్రభుదేవా చెప్పడం వీరి విడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెళ్లికి ముందే ప్రభుదేవా ఇలా ప్రవర్తించడంతో, పెళ్లి తర్వాత ఎలా ఉంటారో అనే భయంతో అతనికి బ్రేకప్ చెప్పేసిందట. ప్రభుదేవాతో విడిపోయిన కొన్నేళ్లకు నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్‌లో పడింది. ఆరేళ్లు రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. 2002లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. సరోగతి పద్ధతిలో ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నయనతార సినిమాల్లో నటిస్తునే తన భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications