ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం. అలా వచ్చి వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం అంటే.. అది కూడా ఎవరి సపోర్ట్ లేకుండా.. వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తక్కువ సమయంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు.
అయితే తాజాగా ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమాతో వస్తున్నాడు అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK).. ఇదో కొత్త కాన్సెప్ట్ లవ్ స్టోరీ.. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 2040 లో లవ్ స్టోరీ ఎలా సాగుతుందో ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. అప్పటికి మన ఇండియా ఎలా ఉంటుంది..? టెక్నాలజీ ఏ రేంజ్ లో పెరిగిపోయింది..? అప్పటికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఉంటుందా..? లేదా..? ఇలా వినూత్నమైన కాస్పెప్ట్ తో తెరకెక్కించారు దర్శకుడు విగ్నేష్ శివన్.

ఇక ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) మూవీ ఏప్రిల్ 10న తమిళం , తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అయితే ఈ మూవీ తమిళం టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ తెలుగు టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ క్రేజీ టీజర్ చూస్తుంటే ఈ మూవీ కేవలం రొమాంటిక్ కామెడీ మాత్రమే కాదని తెలుస్తోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, ఫ్యూచరిస్టిక్ డ్రామా కూడా కలగలిపి ఉందని అర్థం అవుతోంది. దీంతో టీజర్ సినిమాపై అంచనాల్ని ఒక్కసారిగా పెంచేసింది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) మూవీలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో యోగిబాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా, మాళవిక కీలక పాత్రల్లో మెరిశారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీని నయనతార, లలిత్ కుమార్ , ఎల్ కే విష్ణు కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హిట్ పడుతుందా లేదా చూడాలి.












Click it and Unblock the Notifications