అల్లు అర్జున్, సిని పెద్దలపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!!

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదని ప్రశ్నించారు. బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కష్టం గురించి ప్రకాశ్ రాజ్ అభినందించారు. అల్లు అర్జున్ ను జాతీయ అవార్డు వస్తే..అలాంటి హీరోను సన్మానించటానికి అవకాశం దక్కటం లేదా అని నిలదీసారు.

అందరికీ గర్వకారణం:జాతీయ స్థాయిలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని రివార్డులు..అవార్డులు పొందాయి. ఈ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. టాలీవుడ్‌లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయంగా పేర్కొన్నారు. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదని నిలదీసారు. బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణమని చెప్పారు.

Prakash Raj Intersting comments on Allu Arjun, Questioned Telugu cine legends

బన్నీలో ఆకలి చూసాను:రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిదని చెప్పుకొచ్చారు. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్‌ బన్నీని ప్రకాశ్‌ రాజ్‌ దగ్గరికి వెళ్లమంటే..

తాను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్‌ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు తనకు గుర్తున్నాయన్నారు. తరువాత గంగోత్రి చిత్రం షూటింగ్‌ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో 'దిస్‌ బోయ్‌ విల్‌ గ్రో' అన్నానని గుర్తు చేసుకున్నారు. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాననని.. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచారని ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు.

Prakash Raj Intersting comments on Allu Arjun, Questioned Telugu cine legends

సినీ పెద్దలకు ప్రశ్నలు:నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చిందని వ్యాఖ్యానించారు. బన్నీకి జాతీయ అవార్డు వస్తే తన బిడ్డకి వచ్చినట్టు భావిసున్నానని చెప్పారు. తనకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉందన్నారు.

మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టని చెప్పుకొచ్చారు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదని ప్రశ్నించారు. మన సినిమాతో బౌండరీస్‌ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+