నేషనల్ అవార్డులపై ప్రకాశ్ రాజ్ సంచలనం!
Prakash Raj: తన అద్భుత నటనతో పాటు వివాదాస్పద, సూటి కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. జాతీయ అవార్డుల వ్యవస్థపై ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటన సందర్భంగా జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మమ్ముట్టికి అవార్డు అవసరం లేదు..
సోమవారం నాడు 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ అవార్డుల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన 'భ్రమయుగం' చిత్రంలోని 'కోడుమోన్ పోట్టి' పాత్రకు గాను మరోసారి ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకున్నారు. అయితే ఈ ప్రకటన అనంతరం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ప్రకాశ్‌రాజ్ జాతీయ అవార్డుల వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు. "జాతీయ అవార్డులు ఇప్పుడు రాజీ పడ్డాయి. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. మమ్ముట్టి లాంటి మహానటుడి ప్రతిభను గుర్తించకపోవడం జాతీయ అవార్డుల విలువను తగ్గిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. "జాతీయ అవార్డుల్లో సమగ్రమైన న్యాయం జరగడం లేదు. లాబీయింగ్ చేసిన వారికే జాతీయ అవార్డులు వస్తున్నాయి" అని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.

కేరళ అవార్డుల్లోనూ జోక్యం జరిగింది!
కేవలం జాతీయ అవార్డుల వ్యవస్థనే కాక, తాను జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రక్రియలోనూ 'బయటి జోక్యం' జరిగిందని ప్రకాశ్‌రాజ్ స్పష్టంగా వెల్లడించారు. "కమిటీ సభ్యులు మొదట నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు. బయటి వ్యక్తిగా, అనుభవజ్ఞుడిగా ఉండాలని నన్ను అంగీకరించమని కోరారు. కానీ తర్వాత జోక్యం జరిగింది." అని ఆయన తెలిపారు. అవార్డుల ఎంపికలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడిందని.. ఈ విషయం సినీ వర్గాల్లో అందరికీ తెలిసిందేనని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
అర్హతకు అవార్డు కావాలి, ఇన్ఫ్లుయెన్స్‌కు కాదు!
ప్రకాశ్‌రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. "అవార్డులు అర్హతకు ప్రతీకలు కావాలి, ఇన్ఫ్లుయెన్స్‌కు (ప్రభావితం) కాదు" అన్న ఆయన మాటలు సినీ ప్రపంచంలో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ కామెంట్లు ఓ వైపు అవార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలను, పక్షపాత ధోరణిని బయటపెట్టగా.. మరోవైపు నిజమైన ప్రతిభకు గుర్తింపు దక్కాలన్న ఆవశ్యకతను గుర్తు చేశాయి. సామాజిక అంశాలపై నిత్యం కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే ధోరణి కలిగిన ప్రకాశ్‌రాజ్.. ఇప్పుడు సినీ రంగంలోని అత్యున్నత అవార్డుల వ్యవస్థను సైతం ప్రశ్నించడం పలువురి దృష్టిని ఆకర్షించింది.
“Files and piles are getting awards there”
— Gabbar (@Gabbar0099) November 4, 2025
Prakash Raj actor with Spine 🔥👏 pic.twitter.com/75RPoy0OAA
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications