రెండో బిడ్డను కని వారం కూడా కాలేదు..రచ్చ మొదలుపెట్టిన ప్ర‌ణీత

హీరోయిన్ ప్ర‌ణీత సుభాష్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే వీరందరితోనూ సెకండ్ హీరోయిన్‌గా మాత్రమే నటించింది. దీంతో ప్ర‌ణీత స్టార్ హీరోయిన్ కాలేపోయింది. అయినప్పటికి తన గ్లామర్‌తో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటే ఈ అమ్మ‌డు సేవా కార్యక్రమాలతో కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఈ న‌టి కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ నితిన్‌ రాజును వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు 2022లో ఓ పాప‌కు జ‌న్మనిచ్చారు. అనంత‌రం సినిమాల‌కు కాస్త దూరంగా ఉన్నారు. పాప పుట్టాక ప‌లు షోల‌లో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు. తాను మరోసారి గ‌ర్భం దాల్చిన‌ట్లు హింట్ ఇచ్చారు. బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోలను ఇటీవ‌లే సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు ప్రణీత. ఇటీవలే ఈ బ్యూటీ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. న‌టి ఆ ఫొటోల‌ను ఆమె సోష‌ల్‌మీడియాలో త‌న ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.

Pranitha Subhash blue color saree goes viral

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్ర‌ణీత తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు.టెంపుల్స్, వెకేషన్స్, తన పాపకు సంబంధించిన ఫొటోలు, ఇంట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకొన్న ఫెస్టివల్ పిక్స్ తరచూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా ప్రణీత బ్లూ కలర్ శారీ కట్టుకుని ఫొటో షూట్ చేసింది. ఇద్దరి పిల్లలకు తల్లైనా చెక్కుచెదరని అందంతో.. అదే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. చిలిపి ఫోజులిచ్చిన ఫొటోలకు ప్రణీత.. 'బ్లూ కలర్‌లో చూడాలనుకుంటున్నామని చాలా మంది అడిగారు. ఈ రంగు చీర మీ కోసం' అంటూ ప్రణీత ఫొటోలకు ఈ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ప్రణిత షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+