ఏంటీ ఈ స్టార్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా..?
భారతదేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ముందుంటారు. శ్రీనివాస రామానుజన్ ప్రవేశపెట్టిన గణిత సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన 1887 లో తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించారు. 32 ఏళ్లకే మసూచి వ్యాధి బారిన పడి చనిపోయారు. అయితే ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ మరోసారి ట్రెండింగ్ అవుతున్నారు.. కారణం హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఈమె రామానుజన్ మునివరాలు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో నిజమెంత..? నిజంగానే ఈ స్టార్ హీరోయిన్ కు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా..?
శ్రీనివాస రామానుజన్ భార్య జానకి అమ్మళ్. వీరికి సంతానం లేదు. శ్రీనివాస రామానుజన్ చనిపోయిన ముప్పై ఏళ్ల తర్వాత జానకి అమ్మళ్.. ఓ వ్యక్తిని పెంచుకుందని సమాచారం అందుతోంది. అతని పేరు నారాయణ్.. అయితే ఆయన తర్వాతి తరం వాళ్లతో ప్రీతి ముకుందన్ కుటుంబానికి ఏదైనా బంధుత్వం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రీతి ముకుందన్ స్వయంగా వెల్లడిస్తేనే ఈ అంశంపై క్లారిటీ వస్తుంది.

ఇక ప్రీతి ముకుందన్ వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది. అందానికి అందం.. నటనకు నటన ఆమె సొంతం. ప్రీతి ముకుందన్ ఓం భీమ్ భుష్, కన్నప్ప లాంటి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు సరసన నటించి మెప్పించింది. అలాగే తమిళంలో ఈ ఏడాది వచ్చిన బ్లాస్ట్ మూవీ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. బ్లాస్ట్ మూవీ తర్వాత ఆమెకు భారీగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. స్టార్ హీరోలతో నటించే ఆఫర్స్ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications