బిగ్‌బాస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు..ఆ కంటెస్ట్ గర్భవతి ..అతని మీదే అనుమానం..?
బిగ్‌బాస్ షో సంచలనాలకు మారు పేరుగా నిలుస్తుంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.
షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తరువాత సామాన్యులను, పెళ్లైనా జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో మొదటిసారి భార్యాభర్తలైన వరుణ్ సందేశ్-రితిక షేర్‌లను హౌస్‌లోకి తీసుకువచ్చిన బిగ్‌బాస్ యాజమాన్యం.. తరువాత రోహిత్-మారియా జంటను హౌస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వరకు అంత బాగానే సాగింది.

తాజాగా జరుగుతున్న సీజన్‌లో ఓ కంటెస్ట్ గర్భవతి అయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్‌లో కాదని.. హిందీ బిగ్‌బాస్‌లో అని తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుత హిందీ బిగ్‌బాస్‌లో భార్యాభర్తలైన అంకిత లోఖండే, విక్కీ జైన్ కంటెస్ట్‌లుగా కొనసాగుతున్నారు. తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని నీరసంగా ఉందని చెబితే ..బిగ్‌బాస్ యాజమాన్యం మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లారని అక్కడ నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని భర్త విక్కీ జైన్‌కు అంకిత లోఖండే చెప్పడం జరిగింది.

ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని విక్కీ జైన్ , అంకితపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పరిస్థితి ఏంటని ఇద్దరూ భయపడుతున్నారు. ఒకవేళ అంకిత లోఖండే గర్భవతి అయితే కచ్చింతంగా బిగ్‌బాస్ నుంచి బయటకు పంపేస్తారు.గేమ్ కోసం షోకు వెళ్లి ఏకంగా అక్కడే కాపురం పెట్టేశారని నెటిజన్లు అంకిత లోఖండే, విక్కీ జైన్‌ల గురించి కామెంట్స్ చేస్తున్నారు. మరి అంకిత లోఖండే విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications