స్టార్ హీరో ఖైదీ నెంబర్ 6106, మొబైల్ ఫోన్లు, బైక్ లు, కార్లు, ఏం డిమాండ్ రా బాబు
శ్యాండిలవుడ్ స్టార్ హీరో దర్శన్ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నటుడు దర్శన్ కు ఖైదీ నంబర్ 6106 ఇచ్చారు. ఇప్పుడు 6106 నెంబర్ స్టిక్కర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి మొబైల్ షాపుల ముందు, స్టిక్కర్ షాపుల ముందు దర్శన్ అభిమానులు బారులు తీరుతున్నారు.
మొబైళ్ల ఫోన్ కవర్ ల మీద దర్శన్ అభిమానులు తమ అభిమాన హీరో డి బాస్ పై తమ ప్రేమను చూపిస్తూ 6106 నెంబర్ వేయించుకుంటున్నారు.

నటుడు దర్శన్ జైలు ఖైదీ నంబర్ 6106 ఇప్పుడు బైక్‌లు, ఆటోలు మరియు కార్ల వెనుక ముందు కనిపిస్తూ భారీ ట్రెండింగ్ సృష్టిస్తున్నాయి. ఖైదీ నంబర్ 6106 మళ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది . చాలా బైక్‌లు, ఆటోల వెనుక ఒకే ఖైదీ నంబర్ 6106 స్టిక్కర్ కనిపిస్తూ చేతికి స్టిక్కర్‌తో పాటు ఖైదీ స్టిక్కర్‌ను కూడా ఉంచి ట్రెండింగ్ చేస్తున్నారు.
ఖైదీ నంబర్ 6106 స్టిక్కర్లకు ఫుల్ గిరాకీ ఉండడంతో మొబైల్ షాపుల యజమానులు కూడా చివరిలో, మొదట్లో 6106 ఇవ్వలేక, ఆ నెంబర్లు వెతుకడానికి బిజీబిజీగా ఉన్నారు.
బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వందలాది మంది హీరో దర్శన్ అభిమానులు తమ వాహనాలపై అలాంటి స్టిక్కర్లను అంటించారు. హీరో దర్శన్ పరప్ప అగ్రహార జైలు నుంచి జైలు అధికారుల ద్వారా అభిమానులకు చేసిన విజ్ఞప్తి సర్వత్రా వైరల్ అవుతోంది.
శాండల్‌వుడ్ నటుడు దర్శన్ ఇప్పుడు జైలు నుండి తన అసంఖ్యాక అభిమానులకు లేఖ రాశారు. నటుడు దర్శన్ ఓ లేఖ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. హీరో దర్శన్ జైలు నుంచి జైలు అధికారుల ద్వారా అభిమానులకు ఓ సందేశం పంపారు.
అభిమానులు ఎవరూ జైలు దగ్గరకు రాకూడదని, జైలు నిబంధనల ప్రకారం అభిమానులు తనను కలవడానికి అవకాశం లేదని, మీరు నన్ను చూడటానికి జైలు దగ్గరకు వచ్చి వేచి ఉండకూడదని మనవి చేశారు.
తనను చూడటానికి జైలుకు దగ్గరకు వచ్చి తనను కలవడానికి వీలులేదని తెలుసుకుని నిరాశతో తిరిగి వెళ్లకండి, మీరు ఇక్కడికి రాకూడాదని దర్శన్ అభిమానులకు మనవి చేశారు. ఇటీవల సౌమ్యా అనే యువతి తనను పరామర్శించేందుకు వచ్చిందని తెలిసిందని, ఆమెను కలవడం అసాధ్యమని నేను బాధపడ్డాను' అని నటుడు దర్శన్ అన్నారు. దర్శన్ ను కలవకుండా తను భోజనం కూడా చెయ్యనని మొండిపట్టుతో సౌమ్యా బెంగళూరు పరప్పన అగ్రహార ముందు కుర్చుని నిరసన వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది మొత్తం మీద ఇప్పుడు హీరో దర్శన్ ఖైదీ నెంబర్ 6106 నెంబర కర్ణాటకలో బాగా పాపులర్ అయిపోయింది.












Click it and Unblock the Notifications