ఛీ ఛీ ఏంట్రా బాబ్జీ మనకు ఈ చండాలం

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్‌ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ పబ్లిక్‌గా లిప్ కిస్‌లతో మునిగిపోయింది. అందరూ చూస్తుండగానే గాఢమైన చుంబనంతో రెచ్చిపోయింది. ఇలా ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్ మరెవరో కాదు...బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.

ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి చూపించిన ప్రియాంక చోప్రా చదువు పూర్తి కాగానే మోడల్ రంగంవైపు అడుగులు వేసింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడంతో ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్‌గా గెలవడంతో ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తమిళ చిత్రం 'తమిళన్' ద్వారా సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికి, ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది.

Priyanka Chopra and Nick Jonas Lip Lock Viral

అక్కడి స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ఘనత సాధించిన తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 'క్వాంటికో' వంటి సిరీస్‌తో హాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. హాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుని ప్రియాంక చోప్రా సత్తా చాటింది. ఇదే సమయంలో వయస్సులో తనకన్నా వయస్సులో చిన్నవాడైనా హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. వారి జంటకు మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాలతో పాటు, సినిమా విషయాలను సైతం షేర్ చేస్తుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లిన ఆమె.. అతని పైకి ఎక్కి లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయింది. ప్రియాంకచోప్రా, నిక్ జోనాస్‌ కలిసి లిప్ లాక్ పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు.క్యూట్‌ పెయిర్ అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఇదేం అరాచకం తల్లి అని తిడుతున్నారు.ఈ రొమాన్స్ ఇంట్లో చేసుకోవచ్చుగా అంటూ ప్రియాంక ముద్దుల ఫొటోలపై ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌‌కు ముద్దులు పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+