అతను దరిద్రంగా నా లోదుస్తులు గురించి అడిగాడు..రామ్ చరణ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి.కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది.
ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఇంటర్య్వూలో తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..అప్పట్లో నా వయస్సు 19 ఏళ్లు.కెరీర్ స్టార్టింగ్‌లో ఓ దర్శకుడితో సినిమా చేయడానికి వెళ్లినప్పుడు అతను చేసిన పని నా జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. దర్శకుడికి ఎలాంటి బట్టలు కావాలో నా నా స్టైలిస్ట్‌తో మాట్లాడుకోమని చెప్పాను. అతడు నా స్టైలిస్ట్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను.. ఆ సమయంలో డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు తను లోదుస్తులు చూపిస్తేనే తనను చూడడానికి థియేటర్లకు వస్తారు.
కాబట్టి బట్టలు చాలా చిన్నగా ఉండాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ అదే పదాన్ని దాదాపు నాలుగుసార్లు ఉపయోగించాడు. దీంతో నేను మీ సినిమా నేను చేయనని చెప్పి అక్కడి నుంచి వచ్చేశానని చెప్పుకొచ్చింది. నేను ఎలా ఉండాలి, ఎలా చూపించుకోవాలనేది నామీద ఆధారపడి ఉంటుందని ఈ బ్యూటీ తెలిపింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిచింది. ప్రస్తుతం మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.












Click it and Unblock the Notifications