తన లవర్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. వేరే వ్యక్తికి పెళ్లి ఆఫర్ !
తెలుగు బుల్లితెర, డిజిటల్ వేదికల్లో అలరించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు "టేస్టీ తేజ". యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించిన ఆయన.. అదే క్రేజ్‌తో బిగ్ బాస్ తెలుగులోకి అడుగుపెట్టి మరింత ప్రేక్షకాదరణ పొందారు. బిగ్ బాస్ ఇచ్చిన గుర్తింపును తేజ సమర్థంగా వినియోగించుకుంటూ ప్రస్తుతం యూట్యూబ్, ఫుడ్ బిజినెస్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. 'ఇరానీ నవాబ్స్ టీ' పేరుతో ఫ్రాంచైజీలు ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు.
అయితే ఈ స్థాయికి రావడానికి ఆయన ఎదుర్కొన్న కష్టాలు తక్కువ కావు. ఓ టాక్ షోలో తేజ తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. "నా రూపం, బాడీ కారణంగా నాకు తీవ్రమైన ఇన్‌సెక్యూరిటీ ఉండేది. స్కూల్, కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్ ఎదురైంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు అమ్మాయిలతో మాట్లాడే ధైర్యం కూడా లేకపోయింది" అని చెప్పారు. బిగ్ బాస్ షో తర్వాత తన జీవితంలో మార్పు వచ్చిందని, అక్కడ కలిసిన స్నేహితులు తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా సహ కంటెస్టెంట్స్‌తో ఏర్పడిన అనుబంధం తన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిందని చెప్పారు.

అదే కార్యక్రమంలో ఓ సరదా సంఘటనను కూడా పంచుకున్నారు. "సిక్స్ ప్యాక్ చేస్తే పెళ్లి చేసుకుంటా" అని ప్రియాంక జైన్ సరదాగా చెప్పిందని, ఆ విషయాన్ని లైవ్‌లోనే ధృవీకరించడంతో ఆ సంభాషణ వైరల్ అయింది. ఒకప్పుడు బాడీ షేమింగ్‌తో ఇబ్బంది పడిన తేజ, నేడు తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదగడం చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చని ఆయన ప్రయాణం స్పష్టంగా చెబుతోంది.
ఇక ప్రియాంక జైన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. 1998లో జూలై 2న జన్మించింది. జైన్ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెరలోకి వచ్చింది. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ప్రియాంక జైన్.. ఆ తర్వాత తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2018లో 'చెల్తే చల్తే' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌన రాగం, జానకి కలగనలేదు సీరియల్స్ తో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఇక అప్పటి నుంచి సీరియల్స్ తగ్గించిన ఈ భామ.. యూట్యూబ్ వీడియో లతో, సోషల్ మీడియా పోస్టులతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ప్రస్తుతం బుల్లితెర నటుడు శివకుమార్ తో రిలేషన్ లో ఉన్న ఈమె.. అతనితో కలిసి ప్రాంక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం కలిసే ఉంటున్న ఈ జంట.. యూట్యూబ్ వీడియో లతో పాటు పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ ఉంటారు.












Click it and Unblock the Notifications