Dil Raju: మాజీ సీఎం కేసీఆర్‍ను కలిసిన నిర్మాత దిల్ రాజు..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిశారు. తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు అశిస్ రెడ్డి పెళ్లికి రావాలని దిల్ రాజు కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు. అయితే కేసీఆర్ కు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం గురించికూడా దిల్ రాజు అడిగి తెలుసుకున్నారు. దిల్ రాజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎప్పటి నుంచి ప్రచారం కొనసాగుతోంది.
ఆయన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దిల్ సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి ఆయన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది. దిల్ రాజు కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారని చర్చ ప్రారంభం అయింది.

దిల్ రాజు అలియాస్ అస్సలు పేరు వెంకటరమణారెడ్డి. దిల్ సినిమాతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి ఆయన సొంత గ్రామం. ప్రస్తుతం దిల్ రాజు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన ఛైర్మన్ గా అయినప్పుడు రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని చెప్పారు. దిల్ రాజు ఎప్పటి నుంచి నర్సింగ్ పల్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ తో పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ లోక్ సభ టికెట్ కోసం ఆయన కాంగ్రెస్ ఎలాంటి దరఖాస్తు చేయలేదు. ఈ టికెట్ కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఈరవతి అనిల్, ఆకుల లలిత దరఖాస్తు సమర్పించారు.












Click it and Unblock the Notifications