సినిమా హై ఇవ్వకపోతే నన్ను చితక్కొట్టండి అంటున్న నిర్మాత..
సాధారణంగా సినిమా రిలీజ్ సమయంలో నటీనటులు, చిత్ర బృందం తమ సినిమా గురించి మాట్లాడడం సహజమే. కొన్ని కొన్ని సార్లు వారు చేసే కామెంట్స్ కొంచెం ఎక్కువ గానే ఉంటాయి. ఇక మూవీ రిలీజ్ తర్వాత రిజల్ట్ ని బట్టి భారీ స్టేట్మెంట్స్ ఇచ్చిన పలువురు సైతం ఆ తర్వాత ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. ఈ రకమైన కామెంట్స్ ఇప్పటి వరకు చాలానే చూశాం. అయితే లేటెస్ట్ గా ఇప్పుడు ఓ నిర్మాత సినిమాలో ఫైట్స్ చూసి థియేటర్ స్క్రీన్ చింపేయడం పక్కా అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా అంత హై ఇవ్వకుంటే .. సినిమా రిలీజ్ రోజే తనను చితక్కొట్టండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
నిర్మాత ఈ రేంజ్ లో భారీ కామెంట్స్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ డైరెక్టర్లు, నటీనటులు ఓవర్ కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఘటనలు చాలానే చూశాం. కానీ ఈసారి ఏకంగా కొట్టండి అంటూ ఆఫర్ ఇవ్వడం చూస్తే.. సినిమా రిజల్ట్ మీద అందరికీ క్యూరియాసిటీ పెరుగుతోంది. మూవీ హిట్ అయితే ఓకే కానీ ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత పరిస్థితి ఏంటని చర్చ నడుస్తోంది.

ఇంతకీ ఆ కామెంట్స్ చేసిన నిర్మాత ఎవరంటే.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'దిల్ రూబా' మూవీ ప్రొడ్యూసర్ రవి కుమార్. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ రవి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. తాను సినిమా చూసుకున్నానని.. చాలా బాగా నచ్చిందని వ్యాఖ్యానించారు. అలానే మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అని భావిస్తున్నానన్నారు. ఈ సినిమాలో ఫైట్స్ చూసి మీరు అందరూ థియేటర్ స్క్రీన్స్ చింపేస్తారు.. అంత హై ఇస్తుందని తెలిపారు. ఒకవేళ మీకు అలా అనిపించకుంటే రిలీజ్ రోజు మధ్యాహ్నం పెట్టె ప్రెస్ మీట్ లో నన్ను చితక్కొట్టేయండి అని అన్నారు. దీంతో నిర్మాత మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.
మరోవైపు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో కలిసి సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా బయటికి వస్తారు అంటూ చెప్పారు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ తెలిపారు. చూడాలి మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో అని.












Click it and Unblock the Notifications